Nirmal: నిర్మల్‌ జిల్లా లక్ష్మణ చందాలో కాంగ్రెస్‌ నేతల నిరాహార దీక్ష

Nirmal: అల్లోల ఇంద్రకిరణ్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దంటూ నిరసన

Update: 2024-03-12 09:07 GMT

Nirmal: నిర్మల్‌ జిల్లా లక్ష్మణ చందాలో కాంగ్రెస్‌ నేతల నిరాహార దీక్ష

Nirmal: మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న పుకార్లు నిర్మల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో నిరసనలకు కారణమయ్యాయి. ఇందులో భాగంగా లక్ష్మణ చందాలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేశారు. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవద్దంటూ నినాదాలు చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఎన్నో భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకునేందుకే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు...అందుకే తాము చేరికను వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

Tags:    

Similar News