Jagga Reddy: బీఆర్‌ఎస్ నేతలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆగ్రహం
Jagga Reddy: రుణమాఫీపై బీఆర్‌ఎస్ నేతల తప్పుడు ప్రచారం
Jagga Reddy: బీఆర్‌ఎస్ నేతలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆగ్రహం
Jagga Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రైతుల రుణమాఫీ అమలు జరగలేదని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శలను తిప్పికొట్టారు కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి. ఇప్పటి వరకు రుణమాఫీకి సంబంధించి 18వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశారని, ఇంకా 12వేల కోట్ల రూపాయల రుణమాఫీ జరగాల్సి ఉందని.. త్వరలోనే అది కూడా పూర్తి చేస్తామన్నారు.
రుణమాఫీపై రైతుల సమక్షంలోనే చర్చకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని.. బీఆర్‌ఎస్ నేతలు సిద్ధమా అని జగ్గారెడ్డి సవాల్ విసిరారు. మీ వైపు నుండి కెసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, మాజీ మంత్రులు చర్చకు రండి.. మా వైపు నుండి మా సీఎం, మంత్రులు చర్చ లో పాల్గొంటారని అన్నారు జగ్గారెడ్డి.