తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ షోకాజ్ నోటీస్
తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసు ఇచ్చింది.కులగణన సర్వే రిపోర్ట్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి.
తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ షోకాజ్ నోటీస్
తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసు ఇచ్చింది.కులగణన సర్వే రిపోర్ట్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. ఆరు రోజుల్లో వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఆ నోటీసుల్లో కోరింది. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ఈ నోటీసులు అందించింది. ఆ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ జి. చిన్నారెడ్డి ఈ నోటీసును ఇచ్చారు.
కులగణన సర్వేపై ప్రభుత్వం విడుదల చేసిన రిపోర్టుపై ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వం కుండబద్దలు కొట్టిందని ఆయన అన్నారు. బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని అర్ధమైందని ఆయన విమర్శించారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీగా ఉంటూ ఆయన పార్టీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడినా సహించేది లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఫిబ్రవరి 5న ప్రకటించారు. పార్టీకి వ్యతిరేకంగా మల్లన్న చేసిన వ్యాఖ్యలపై షోకాజ్ నోటీసులు ఇవ్వాలని పీసీసీ చీఫ్ పార్టీ క్రమశిక్షణ కమిటీని ఆదేశించారు. ఈ కమిటీ మల్లన్నకు నోటీసులు జారీ చేసింది.