బండిని అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తే... పార్టీ పదవులకు రాజీనామా చేస్తామంటున్న పలువురు నేతలు

Telangana: సోషల్ మీడియాలో బండికి మద్ధతుగా అభిమానుల పోస్టులు

Update: 2023-07-03 06:51 GMT

బండిని అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తే... పార్టీ పదవులకు రాజీనామా చేస్తామంటున్న పలువురు నేతలు

Telangana: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చుతారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో కేడర్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బండి వచ్చిన తర్వాతే కేడర్‌లో నూతనోత్సాహం వచ్చిందంటూ బీజేపీ కార్యకర్తలు అంటున్నారు. బండిని మార్చవద్దంటూ హైకమాండ్‌ను కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బండి సంజయ్‌ను స్టేట్ చీఫ్‌గా తప్పిస్తే పార్టీ తీవ్ర నష్టపోతుందని అంటున్నారు. మరో వైపు బండికి మద్దతుగా రాష్ట్రంలోని పలువురు బీజేపీ నాయకులు నిలుస్తున్నారు. బండిని అధ్యక్షుడిగా తొలగిస్తే పార్టీ పదవులకు రాజీనామా చేస్తామని చెబుతున్నారు.    

Tags:    

Similar News