18 గంటలు సెల్‌టవర్‌పైనే ..మంత్రి హామీతో ఆందోళన విరమించిన కార్మికులు

నల్లగొండ జిల్లాలోని హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌బీ కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఆర్నెల్లుగా జీతాలు చెల్లించకపోవడంతో ఆగ్రహానికి గురై వాటర్ సిగ్నల్ క్యాడ్ టవర్ ఎక్కి నిరసన తెలుపారు. మంత్రి మల్లారెడ్డి హామీతో ఆందోళన విరమించారు. చింతపల్లి మండలం మల్‌ గ్రామం వద్ద గత 18 గంటలుగా సెల్‌టవర్‌పైనే ఉండి కార్మికుల ఆందోళన చేస్తున్నారు.

Update: 2019-09-22 09:12 GMT

నల్లగొండ జిల్లాలోని హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌బీ కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఆర్నెల్లుగా జీతాలు చెల్లించకపోవడంతో ఆగ్రహానికి గురై వాటర్ సిగ్నల్ క్యాడ్ టవర్ ఎక్కి నిరసన తెలుపారు. మంత్రి మల్లారెడ్డి హామీతో ఆందోళన విరమించారు. చింతపల్లి మండలం మల్‌ గ్రామం వద్ద గత 18 గంటలుగా సెల్‌టవర్‌పైనే ఉండి కార్మికుల ఆందోళన చేస్తున్నారు. అధికారులు నచ్చజెప్పినా వారు వెనక్కి తగ్గటం లేదు. కార్మికుల ఆందోళనతో హైదరాబాద్‌కు నీటి సరఫరా తగ్గిపోయింది. జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్‌కు కృష్ణా జలాల సరఫరాను ఆపేసి ఆందోళన చేస్తున్న హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు ఎట్టకేలకు దిగొచ్చారు. యాధావిధిగా విధులకు హాజరయ్యారు. కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఫోన్ చేసి మాట్లాడడంతో ఆందోళన విరమించారు. హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ కార్మిక నేత పల్లా దేవేందర్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి మల్లారెడ్డి.. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే మళ్లీ పోరాటం తప్పదని కార్మిక సంఘం అధ్యక్షుడు పల్లా దేవేందర్‌రెడ్డి హెచ్చరించారు.

Tags:    

Similar News