కమ్యూనిస్టు పార్టీలు ఉద్యమాలు చేయడంలేదు : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

తెలంగాణ సాయుధపోరాటంలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్దీలదే కీలక పాత్రన్నారు జగ్గారెడ్డి. రాష్ట్ర విభజన తర్వాత కమ్యూనిస్టుల ఉద్యమాలే చేయడంలేదని అన్నారు.

Update: 2019-09-17 07:05 GMT

తెలంగాణ సాయుధపోరాటంలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్దీలదే కీలక పాత్ర అని టీకాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అయితే సమైక్యాంధ్రలో ప్రజా సమస్యలపై కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోరాడేవని... రాష్ట్ర విభజన తర్వాత కమ్యూనిస్టుల ఉద్యమాలే చేయడంలేదని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. అన్ని మతాల చెందిన వారు కలిసి చేసిన పోరాట ఫలితమే విలీనమన్నారు. నెహ్రూ, పటేల్‌ కలిసి హైద్రాబాద్‎ను విలీనానికి పూనుకున్నారని తెలిపారు. అమర వీరుల త్యాగలను స్మరించుకోవాలి జగ్గారెడ్డి అన్నారు.

Tags:    

Similar News