రేపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం పర్యటన

Update: 2019-12-29 11:28 GMT

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రగతి భవన్‌ నుంచి రేపు ఉదయం 10:30 గంటలకు బయలుదేరుతారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చేరుకోగానే తొలుత వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకోనున్నారు. అనంతరం నిండుకుండలా మారిన మిడ్‌ మానేరు(రాజరాజేశ్వరస్వామి )డ్యాంను సందర్శించనున్నారు. ఎప్పుడూ లేనంతగా మిడ్ మానేరుడ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం నింపడం ఇదే మొదటి సారి. ఈ సందర్భంగానే సీఎం కేసీఆర్ ఈ ప్రాంతంలో పర్యటించనున్నారు.

ఇప్పటి వరకూ మిడ్ మానేరులో చేరిన నీటితో రెండు లక్షల 35వేల ఎకరల పంట సాగులోకి రానుంది. ఇదిలా ఉంటే ఇటీవలే భారీ పెట్టుబడితో పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుని పూర్తి చేసారు. ఇందులోని 9వ ప్యాకేజీ నిర్మాణంలో ఉండగా అది పూర్తయ్యాక సీఎం ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చని ఇదివరకే ప్రచారం కొనసాగింది. అంతే కాక ఇటు వేములవాడలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ సందర్బంగా ఆ‍యన పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు రక్షణ చర్యలను, భారీ బందోబస్తును ఏర్పాటు చేసారు.




Tags:    

Similar News