CM KCR: మంచిర్యాలలో పర్యటించనున్న సీఎం కేసీఆర్
CM KCR: కలెక్టర్ కార్యాలయం, ఎస్పీకార్యాలయం, పార్టీ కార్యాలయాల ప్రారంభం
CM KCR: మంచిర్యాలలో పర్యటించనున్న సీఎం కేసీఆర్
CM KCR: ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మంచిర్యాలలో పర్యటించనున్నారు. కొత్తగా నిర్మించిన కలెక్టర్ కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయం, పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవాలతోపాటు పోడు పట్టాలను పంపిణీ చేయనున్నారు. రేపు ముఖ్యమంత్రి పర్యటనను విజయ వంతం చేయాలని జిల్లా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాక సంద్భంగా ఏర్పాటు చేసిన సభా ప్రాంగణాన్ని ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జిల్లా పరిషత్ ఛైర్మన్ లక్ష్మీ, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు సభా ఏర్పాటు పనులను పర్యవేక్షించారు. కేసీఆర్ సభకు భారీగా జనాన్ని సమీకరించేందుకు ప్రజాప్రతినిధులు బాధ్యతగా తీసుకున్నారు.