నేడు కలెక్టర్లు, అధికారులతో సీఎం కేసీఆర్ విస్తృతస్థాయి సమావేశం

గ్రామాల సమగ్ర వికాసం లక్ష్యంగా సీఎం కేసీఆర్ వడివడి అడుగులు వేస్తున్నారు. 30 రోజుల ప్రణాళిక అమలుపై అధికారులకు మార్గదర్శనం చేసేందుకు నేడు కలెక్టర్లు, అధికారులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

Update: 2019-09-03 00:30 GMT

గ్రామాల సమగ్ర వికాసం లక్ష్యంగా సీఎం కేసీఆర్ వడివడి అడుగులు వేస్తున్నారు. 30 రోజుల ప్రణాళిక అమలుపై అధికారులకు మార్గదర్శనం చేసేందుకు నేడు కలెక్టర్లు, అధికారులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కేసీఆర్ సమావేశం నిర్వహించే టీఎస్‌ఐఆర్‌డీ ఆవరణను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశ నిర్వహణ ఏర్పాట్లపై అధికారులకు మంత్రి ఎర్రబెల్లి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ గ్రామాల సమగ్ర వికాసం లక్ష్యంగా నేడు నిర్వహించే సదస్సు గ్రామీణ, పంచాయతీరాజ్ వ్యవస్థలో గొప్ప మైలురాయిగా నిలుస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సెప్టెంబర్ 6వ తేదీ నుంచి అమలవుతున్న 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక పంచాయతీరాజ్ వ్యవస్థలోనే కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.

Tags:    

Similar News