మరో పదేళ్ళు నేనే సీఎం : కేసీఆర్

Update: 2019-09-15 11:38 GMT

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ముఖ్యమంత్రిగా చేస్తారంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో స్పందించారు. గత 20 ఏళ్ల నుండి నా ఆరోగ్యం బాగులేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇంకో పదేళ్లు నేనే సీఎంగా ఉంటానని, మరో మూడుసార్లు టీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని అయన ఆశాభావం వ్యక్తం చేసారు. నాకు ఇప్పుడు 66 ఏళ్లని, ఇంకో పదేళ్లన్నా సీఎంగా చేస్తానని కేసీఆర్ అన్నారు. ఎవరు ఎన్ని శాపాలు పెట్టినా నాకేం కాదు అని కేసీఆర్ వాఖ్యానించారు. 

Tags:    

Similar News