గన్నీ బ్యాగుల కోసం ప్రధానికి సీఎం కేసీఆర్‌ ఫోన్‌

Update: 2020-04-06 07:36 GMT

రాష్ట్రంలో గన్నీ బ్యాగుల కొరతని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు సీఎం కేసీఆర్. ఆయనతో ఫోన్ లో మాట్లాడిన సీఎం పశ్చిమ బెంగాల్లో గన్నీ బ్యాగుల తయారీ పరిశ్రమలను తెరిపించాలని కోరారు. బ్యాగుల్ని ట్రాన్స్ పోర్ట్ చేసేందుకు ప్రత్యేక రైళ్లను అనుమతించాలన్నారు. కేసీఆర్ వినతిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోడీ సంబంధిత శాఖలతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.

మరోవైపు రాష్ట్రంలో వరికోతలకు, ధాన్యం సేకరణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం కేసీఆర్. ధాన్యం సేకరణపై ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. వరికోతలకు హార్వెస్టర్లు ఉపయోగించే పరిస్థితిని గ్రామాల్లో కల్పించాలన్నారు. హార్వెస్ట్ పరికరాలను బిగించే మెకానిక్ లకు ప్రత్యేక పాసులిచ్చి అనుమతించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల దగ్గర కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సూచించారు సీఎం.

Tags:    

Similar News