Weather Updates: తెలంగాణలో చురుగ్గా కదులుతోన్న నైరుతి రుతుపవనాలు
Weather Updates: మరో రెండు రోజుల పాటు వర్షాలు * ఉమ్మడి మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, కరీంనగర్‌లో భారీ వర్షాలు
Representational image
Weather Updates: తెలంగాణలో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశమున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. పది రోజులుగా చినుకు లేక దిక్కులు చూస్తున్న రైతులకు ఇప్పుడు పడుతున్న వర్షాలు కాస్త ఊరటనిచ్చాయి. జూన్ మొదటి వారంలో తొలకరి జల్లులు కురవడంతో రైతన్నలు వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు.. ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో.. మొక్కలు ఎండిపోయే స్థితికి చేరుకున్నాయి... దాంతో ఇప్పుడు పడిన వర్షాలతో అవి మళ్లీ ప్రాణం పోసుకున్నాయి.. రెండు రోజులుగా కురుస్తున్న వానలతో పత్తి, మక్క, కందిలాంటి మెట్ట పంటలకు ప్రాణం లేచొచ్చినట్టయింది. ఉమ్మడి మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో వాగులు పొంగి పోర్లాయి.. దుందుభివాగులో వరద ఉధృతి పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరింది. దాంతో దిగువకు 18 వేల క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నారు.
అటు ఏపీలోనూ విస్తరంగా వర్షాలు కురుస్తున్నారు. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాలపై ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ఏపీ తీరానికి విస్తరించింది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శఆఖ తెలిపింది. రాష్ట్రంలోని తీర ప్రాంతాల పరిసరాల్లో సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.