C P Radhakrishnan: తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు
C P Radhakrishnan: సీపీ రాధాకృష్ణన్‌కు బాధ్యతలు అప్పగించిన రాష్ట్రపతి
C P Radhakrishnan: తెలంగాణ గవర్నర్ పదివికి తమిళి సై సౌందర రాజన్ రాజీనామా చేయడంతో జార్ఖండ్ గవర్నర్‌కు అదనపు బాధ్యతలను కేంద్రం అప్పజెప్పింది. ఈ మేరకు రాష్ట్రపతి ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణకు పూర్తిస్థాయి గవర్నర్ నియామకం జరిగేదాకా సీపీ రాధాకృష్ణన్ గవర్నర్‌గా కొనసాగనున్నారు. తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ 1998, 99 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున కోయంబత్తూరు నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే ఆ తర్వాత మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. గతేడాది ఫిబ్రవరిలో ఆయన జార్ఖండ్‌కు గవర్నర్‌గా నియమితులయ్యారు.