నేడు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ స్వేదపత్రం రిలీజ్

BRS: ముహూర్తం ఫిక్స చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

Update: 2023-12-24 02:18 GMT

నేడు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ స్వేదపత్రం రిలీజ్ 

BRS: బీఆర్ఎస్‌ ప్రభుత్వ పాలనలో తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని వివరిస్తూ రూపొందించిన స్వేదపత్రాన్ని ఇవాళ విడుదల చేయనున్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణభవన్‌లో పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా దీనిని కేటీఆర్‌ విడుదల చేస్తారు. నిన్ననే ఈ స్వేద పత్రం విడుదల చేయాల్సి ఉన్నా.. ఇతర అత్యవసర కార్యక్రమాల వల్ల దీనిని ఈరోజుకు వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆర్థిక, ఇంధన రంగాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇటీవల శాసనసభలో శ్వేతపత్రాలు విడుదల చేయగా.. వాటికి పోటీగా స్వేదపత్రాన్ని విడుదల చేయాలని బీఆర్ఎస్‌ నిర్ణయించింది. దీనిపై మూడు రోజుల పాటు కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇతర నేతలు విస్తృతస్థాయిలో చర్చలు జరిపి, సమాచారాన్ని సేకరించి, దానిని స్వేదపత్రంలో పొందుపరిచారు.

Tags:    

Similar News