Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్.. అసలు ఏం జరిగింది..?
Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని గురువారం అరెస్ట్ చేశారు.
Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్.. అసలు ఏం జరిగింది..?
Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని గురువారం అరెస్ట్ చేశారు. హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో డిసెంబర్ 4న కేసు నమోదైంది. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు ఆయనను కలిసేందుకు వెళ్లిన సమయంలో పోలీసులు హరీష్ రావును అదుపులోకి తీసుకున్నారు.
అసలు ఏం జరిగింది?
హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు డిసెంబర్ 4న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ విషయమై సీఐ రాఘవేందర్ అపాయింట్ మెంట్ ను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీసుకున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ కు వెళ్లే సమయంలోనే సీఐ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించడంపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ విషయమై సీఐతో కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ వర్గాలు వాగ్వాదానికి దిగారు.సీఐ వాహనాన్ని అడ్డుకున్నారు. విధులకు ఆటంకం కల్గించారని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది.
కౌశిక్ రెడ్డి అరెస్ట్
ఈ కేసు నమోదైన నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఇంటికి ఇవాళ ఉదయం బంజారాహిల్స్ పోలీసులు వెళ్లారు. పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కౌశిక్ రెడ్డి ఇంటికి హరీష్ రావు వెళ్లిన సమయంలో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఆ తర్వాత కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.