Shri Ganesh: వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బీఆర్‌ఎస్ నేత శ్రీ గణేష్
Shri Ganesh: గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 12 ఉచిత ప్రభుత్వ ఆన్‌లైన్ సేవలు
Shri Ganesh: కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజల కోసం బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు శ్రీ గణేష్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేసే వివిధ పథకాలను ఉపయోగించుకునే విధంగా శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆన్లైన్ సేవలను ప్రారంభించారు. అందులో ప్రధానంగా రేషన్ కార్డ్, వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్, ఒంటరి మహిళ పెన్షన్, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, వితంతు పెన్షన్, ముఖ్యమంత్రి సహాయనిధి, కొత్త ఓటర్ కార్డు, తదితర సర్వీసులను ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఆన్లైన్ సేవలను కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు చోట్ల శ్రీ గణేష్ ప్రారంభించారు. పేద ప్రజలకు సేవ చేయటంతోనే సంతృప్తి ఉందని శ్రీ గణేష్ తెలిపారు.