ఆర్టికల్ 370 రద్దుపై రాజాసింగ్‌ కీలక వ్యాఖ్యలు

Update: 2019-08-05 09:30 GMT

జమ్ముకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ చేశారు. 370 ఆర్టికల్‌ను రద్దు చేసిన ఈ రోజు భారత చరిత్రలో నిలిచిపోతుందన్నారు రాజాసింగ్‌. ప్రధాని మోడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాశ్మీరులు ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారని అన్నారు. బీజేపీని దేశప్రజలు మరిచిపోలేరని.. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లే 370 ఆర్టికల్‌ను రద్దు చేసిందన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కాశ్మీర్‌లో ప్రతి యువకుడికి ఉద్యోగం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. కాగా కేంద్రసర్కార్ నిర్ణయంతో కాశ్మీర్ యువతకు చాలా మంచి వార్త అన్నారు. ఇకపై అక్కడ కంపెనీలు ఏర్పాటయ్యి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. అలా కాకుండా యువతి ఎప్పటిలాగే ఇండియన్ ఆర్మీపై రాళ్లు విసిరితే ఆ చేతులు ఉండవన్నారు. రాళ్లకు బుల్లెట్లతో సమాధానం ఇస్తామన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన ట్రిపుల్ తలాక్ చట్టంతో ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారని రాజాసింగ్ చెప్పుకొచ్చారు. బీజేపీ హిందువుల పార్టీ అని, హిందూ ధర్మాన్ని కాపాడటమే తమ లక్ష్యం అని చెప్పుకొచ్చారు

Tags:    

Similar News