Etela Rajender: KCRకు ముఖం లేకే మోడీ టూర్ కు దూరం...
Etela Rajender: సీఎం కేసీఆర్పై ఫైర్ అయ్యారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్.
Etela Rajender: KCRకు ముఖం లేకే మోడీ టూర్ కు దూరం...
Etela Rajender: సీఎం కేసీఆర్పై ఫైర్ అయ్యారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. తన స్వార్థ రాజకీయాల కోసం కేంద్రంపై నిప్పులు చెరుగుతున్న కేసీఆర్ రాష్ట్రంలో అభివృద్ది పనులు ప్రారంభించేందుకు ప్రధాని మోడీ వస్తుంటే.. కేసీఆర్ కు మొహం చెల్లక ఢిల్లీకి వెళ్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అసమర్ధ పనితీరు వల్లే కేంద్రం రాష్ట్రంలోని రైతులవడ్లు కొనలేని పరిస్థితి నెలకొందన్నారు.
రైతుబంధు ఇస్తు వడ్లు కొనుగోలులో కట్టింగ్ పేరుతో రైతులను ముంచుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం యూటీలైట్ సర్టిఫికెట్ ఇవ్వకపొవడం వల్లే రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వటం లేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న ఆయన ప్రధాని పర్యటనకు రక్షణ కల్పించాల్సింది పోలీస్ వ్యవస్థ ఆంక్షలు విధించడం సరికాదన్నారు. 2013లోనే గ్రానైట్ సంస్థలు 750 కోట్లు పన్ను ఎగబెట్టారని కేసు నమోదైన విషయాన్ని గుర్తు చేశారు.