Telangana: బడంగ్పేట్ సర్కిల్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

Telangana సఫిల్‌గూడ మైసమ్మ గుడి ఘటనను ఖండిస్తూ బడంగ్పేట్ సర్కిల్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ నాయకులు. కాంగ్రెస్ పాలనలో దేవాలయాలకు భద్రత లేదని ఆరోపణలు.

Update: 2026-01-12 10:16 GMT

Telangana: బడంగ్పేట్ సర్కిల్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

Telangana: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శంషాబాద్ జోన్ బడంగ్పేట్ సర్కిల్‌లో బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన చేపట్టారు.

ఇటీవల సఫిల్‌గూడ కట్ట మైసమ్మ గుడి ప్రాంగణంలో ఓ ముస్లిం యువకుడు మలవిసర్జన చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో హిందువులకు, హిందూ దేవాలయాలకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలపై రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలపై, హిందువులపై దాడులు రోజురోజుకీ పెరుగుతున్నాయని ఆరోపించిన వారు, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.

భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు కొనసాగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడతారని బీజేపీ నాయకులు హెచ్చరించారు.

Tags:    

Similar News