సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆర్థిక క్రమశిక్షణ లేదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. బడ్జెట్లో ఏమీ లేదని అంచనాలకు వాస్తవాలకు పొంతన లేకుండా బడ్జెట్ ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకోసం కేసీఆర్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెడుతుందని ఆశించిన ప్రజలకు ఇది ఏమాత్రం ఉపయోగపడదని అన్నారు. హామీలను అమలు చేయలేక చేతులు ఎత్తేసిందని ఆ విషయం ఈ బడ్జెట్ తో స్పష్టం అవుతోందని భట్టి అన్నారు.