దోసకాయల కోసం ఎగబడ్డ జనం..ఎందుకో తెలుసా?

ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ నడుస్తుండడంతో ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు సరిగ్గా దొరకడంలేదు.

Update: 2020-03-31 10:37 GMT
Cucumber

ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ నడుస్తుండడంతో ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు సరిగ్గా దొరకడంలేదు. ఈ సమయంలో ఏ వస్తువు దొరికినా దాన్నే అమృతంలా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే షాద్ నగర్ వాసులకు ఓ బంపర్ ఆఫర్ తగిలింది. బెంగళూరు రహదారి వెంట షాద్‌నగర్ వద్ద రోడ్డు పక్కన బస్తాలకు బస్తాలు దోసకాయల బస్తాలు దర్శనమిచ్చాయి. అది గమనించిన స్థానికులు ఈ కరువు కాలంలో వాటిని వదులుకోలేక గబగబా అందినకాడికీ తీసుకొని అక్కడ నుంచి వెల్లిపోయారు. హమ్మయ్య లాక్ డౌన్ ముగిసేంత వరకు రోజుకో కాయ చొప్పున పచ్చడికి ఉపయోగపడతాయంటూ హ్యాపీగా తీసుకెల్లిపోతున్నారు. ఆ దృశ్యాలు కెమెరాల కంటికి చిక్కాయి.

అసలు ఈ దోసకాయ బస్తాలు రహదారి పక్కకి ఎలా వచ్చాయనే విషయానికొస్తే కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నుంచి హైదరాబాద్ కు ఓ వాహనం దోసకాయల లోడ్ తో వచ్చింది. అయితే రాష్ట్రంలో లాక్ డౌన్ నడుస్తుండడంతో ఎవరూ దోసకాయలను కొనుగోలు చేయలేదు. దీంతో ఆ వాహనం వచ్చిన దారి గుండానే తిరుగు ముఖం పట్టింది. ఇంకా ఆ దోసకాయలు బెంగులూరు దాకా తీసుకెల్లడం ఎందుకంటూ ఏం చేయాలో అర్థం కాక రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ బైపాస్ రహదారిపై పారబోసి వెళ్లారు. ఇంకేముంది అక్కడి జనాలకు ఫ్రీగా అన్నేసి బస్తాల దోసకాయలు దొరకడంతో ఎవరికి ఇష్టం వచ్చినన్ని వారు తీసుకెల్లిపోయారు.

Tags:    

Similar News