Karimnagar: కరీంనగర్‌లో ఎలుగుబంట్ల హల్‌చల్.. శివారు వాసుల్లో హడల్
Karimnagar: ఇళ్ల మధ్యలో సంచరిస్తుండటంతో భయాందోళనలో స్థానికులు
Karimnagar: కరీంనగర్‌లో ఎలుగుబంట్ల హల్‌చల్.. శివారు వాసుల్లో హడల్
Karimnagar: కరీంనగర్‌లో ఎలుగుబంటి హల్‌చల్ చేస్తోంది. ఇళ్ల మధ్యలో తిరుగుతూ జనానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. రాత్రి నగర శివారులోని రజ్వి చమన్ ప్రాంతంలోని ఇళ్ల మధ్య సంచరిస్తూ కనపడింది. ఇవాళ ఉదయం ఏకంగా నగరంలోకి ప్రవేశించింది. రేకుర్తి నడిరోడ్డుపై సంచరించి జనాలను పరుగులు పెట్టించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఎలుగుబంటి కోసం సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు.