సమ్మక్క-సారలమ్మకు బతుకమ్మ తొలి చీర

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగుతుంది. అందులో భాగంగా గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్వవతి రాథోడ్ మేడారంలో సమ్మక్క-సారలమ్మ వారిని దర్శిచుకొని చీరలు సమర్పించారు.

Update: 2019-09-23 06:47 GMT

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగుతుంది. అందులో భాగంగా గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్వవతి రాథోడ్ మేడారంలో సమ్మక్క-సారలమ్మ వారిని దర్శిచుకొని చీరలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంత్రిగా తన తొలి పర్యటన గిరిజన ప్రాంతంలో జరపడం బతుకమ్మ పండగ చీరల పంపిణీతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందించదగ్గ విషయమన్నారు. గిరిజన తండాలో పుట్టి, పెరిగిన తనకు ముఖ్యమంత్రి మంత్రివర్గంలో స్థానం కల్పించడం బాధ్యత పెంచిందన్నారు. సీఎం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలనే కోరికతో మేడారం సమ్మక్క-సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని, బతుకమ్మ తొలి చీరలను అమ్మవార్లకు సమర్పించానన్నారు. అనంతరం ఆమె ములుగులో చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Tags:    

Similar News