Nims: నిమ్స్‌లో బ్యాటరీ కార్లు.. ఆస్పత్రి ఆవరణలో కాలుష్య నియంత్రణకు దోహదం..!

Nims: సత్ఫలితాలనిస్తున్న బ్యాటరీ కార్ల వినియోగం

Update: 2023-08-22 02:23 GMT

Nims: నిమ్స్‌లో బ్యాటరీ కార్లు.. ఆస్పత్రి ఆవరణలో కాలుష్య నియంత్రణకు దోహదం..!

Nims: నిమ్స్ లో చికిత్సకు వచ్చే రోగుల సౌకర్యార్థం బ్యాటరీ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చారు... ఆస్పత్రి మెయిన్ గేట్ వద్ద కార్లను ఏర్పాటు చేశారు..నిమ్స్ లోపలికి ప్రైవేట్ వాహనాల రాక పోకలు నియంత్రించే క్రమంలో బ్యాటరీ కార్లను ప్రవేశపెట్టారు. ఆటోలు, క్యాబ్ లను నియంత్రించేందుకు యాజమాన్యం ఈ దిశగా చర్యలు చేపట్టింది. ఆస్పత్రి ప్రాంగణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తనీకుండా తీసుకున్న చర్యల్లో బ్యాటరీ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిమ్స్ బ్రాంచ్ సమకూర్చిన బ్యాటరీ కార్లతో పాటు అవసరమైతే మరిన్నింటిని అందుబాటులోకి తీసుకురానున్నామని నిమ్స్ డైరెక్టర్ బీరప్ప తెలిపారు. ఆస్పత్రి ఆవరణలో ట్రాఫిక్ సమస్యను నియంత్రించడంతోపాటు, కాలుష్య నియంత్రణకు బ్యాటరీ కార్లు దోహదం చేస్తాయని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. ఆస్పత్రికి వచ్చే రోగుల సేవలో బ్యాటరీ కార్లు కీలకపాత్ర పోషిస్తాయని అన్నారు.

నిమ్స్ ఆస్పత్రికి వచ్చే రోగులు, వృద్ధులు, చిన్నపిల్లలు బ్యాటరీ కార్లను వినియోగించుకోవచ్చు. ఆస్పత్రి ఆవరణలో బ్యాటరీ కార్లను వినియోగించుకుంటున్న రోగులు సంతృప్తికరంగా ఉన్నాయని ఆనందం వ్యక్తంచేశారు.

Tags:    

Similar News