కేసీఆర్ మాటలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతాయి : బండ్ల గణేష్

సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పై ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు.

Update: 2020-05-06 09:03 GMT
KCR (File Photo)

సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పై ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంపై అయన స్పందించారు. కేసిఆర్ స్వయంగా ఇంటికి వచ్చి, అందరితో మాట్లాడినట్టుగా అనిపించిందని అన్నారు.

"గౌరవ మన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడితే ఆయన స్వయానా ఇంటికి వచ్చి అందరికీ మంచి చెప్పి వెళ్లినట్టు ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది" అని ఆయన వ్యాఖ్యానించారు. 'గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు మాట్లాడే మాటలు ప్రతి మనిషి హృదయాల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతాయి మీరు మీ మాటలు మాకు దైర్యం సార్ అంటూ పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మద్యం షాపులు ఓపెన్ చేయకపోతే నష్టాన్ని మీర విధానం అద్భుతంగా ఉంది ప్రశంసించారు. కెసిఆర్ బతికి ఉన్నంత కాలం.. రైతుబంధు పథకం యధాతథంగా ఉంటుందని..కేసిఆర్ చిత్రాన్ని జోడిస్తూ కామెంట్స్ చేశారు. గణేష్ తనకు రాజకీయాలు వద్దంటూనే లోకేశ్ పై ఘాటైన విమర్శలు, కేసిఆర్ పై ప్రశంసలు చేయడం చర్చనీయాంశంగా మారింది.




 



 


Tags:    

Similar News