Bandi Sanjay: ఎన్నికల ముందుగా కేసీఆర్ డ్రామాలాడుతున్నారు

Bandi Sanjay: ఆర్టీసీ కార్మికులను మరోసారి మోసగించేందుకు కేసీఆర్ డ్రామాలు

Update: 2023-08-05 01:50 GMT

Bandi Sanjay: ఎన్నికల ముందుగా కేసీఆర్ డ్రామాలాడుతున్నారు

Bandi Sanjay: ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రకటనలో మోసపూరిత కుట్ర దాగి ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆర్టీసీ కార్మికులు జీవితాలను కాపాడాలని ఉద్యమించినపుడు కనికరించని కేసీఆర్, ఎన్నికల ముందు కొత్త నాటకానికి తెరలేపారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఆర్టీసీ సంస్థను నిర్వీర్యంచేసిన కేసీఆర్, ఉద్యోగుల కష్టాలను విస్మరించారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్రను గుర్తుచేశారు. ఆర్టీసీ కార్మికులకు, ఉద్యోగులకు భారతీయ జనతాపార్టీ అండగా ఉంటుందని, కలలను సాకారం చేస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు.

Tags:    

Similar News