హరీశ్ రావుపై బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు
హరీశ్ రావుపై బాచుపల్లి పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. హరీశ్ రావుతో పాటు మరో ముగ్గురి నుంచి తనకు ప్రాణహాని ఉందని చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హరీశ్ రావుపై బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు
Bachupally Police Files Case Against BRS leader Harish Rao
హరీశ్ రావుపై బాచుపల్లి పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. హరీశ్ రావుతో పాటు మరో ముగ్గురి నుంచి తనకు ప్రాణహాని ఉందని చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు బీఎన్ఎస్ 351 (2), ఆర్ డబ్ల్యూ 3 (5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
హరీశ్ రావుతో పాటు సంతోష్ కుమార్, రాములు, వంశీపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో హరీశ్ రావు ఏ 2 గా పోలీసులు చేర్చారు. గతంలో తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారని హరీశ్ రావుపై చక్రధర్ గౌడ్ పోలీసులను ఆశ్రయించారు. హరీశ్ రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసు దర్యాప్తుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు స్టే విధిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 19న హైకోర్టు ఆదేశించింది. ఇదే కేసులో హరీశ్ రావును అరెస్ట్ చేయవద్దని 2024 డిసెంబర్ 5న హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో దర్యాప్తుపై స్టే విధించింది.హరీశ్ రావు పీఏ వంశీకృష్ణతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తనను బెదిరిస్తున్నారని వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములును ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేశారు.