Mahabubabad: మహబూబాబాద్‌లో ఆటో డ్రైవర్‌ వినూత్న ఆలోచన

Mahabubabad: టాప్‌పై పూల మొక్కలు పెంచుతున్న ఆటో డ్రైవర్ అంజి

Update: 2024-04-16 11:15 GMT

Mahabubabad: మహబూబాబాద్‌లో ఆటో డ్రైవర్‌ వినూత్న ఆలోచన

Mahabubabad: మండే ఎండలతో తెలుగురాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. వేసవి తాపానికి బయటకు రావాలంటే భయపడుతున్నారు ప్రజానీకం. ఈ నేపథ్యంలో ప్రయాణికుల కోసం వినూత్నంగా ఆలోచించాడు ఓ ఆటో డ్రైవర్. తన ఆటోలో ప్రయాణించే వారికి ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగేలా గార్డెన్ సెటప్ చేశాడు.

మహబూబాబాద్‌‌కు చెందిన అంజి ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన ఆటోలో ప్రయాణించే వారికి చల్లదనం అందించేలా ఆటో రూఫ్‌పై గార్డెన్ ఏర్పాటు చేశాడు. ఇనుప ప్లేట్లను అమర్చి వాటిపై పూల మొక్కలు పెంచుతున్నాడు. ఆ మొక్కలు ఎండకుండా వాటిపై పరదా కూడా ఏర్పాటు చేశాడు. టాప్‌పై మొక్కలు ఉండటంతో లోపల ప్రయాణించే వారికి ఎండ వేడి తగలకుండా ఉండటంతో.. ప్రయాణికులు అంజి ఆటోలో ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Tags:    

Similar News