ప్రతి ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: అసదుద్దీన్ ఒవైసీ

హైదరాబాద్‌లోని దారుస్సలాంలోని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ భారీ బహిరంగ సభను శనివారం నిర్వహించారు.

Update: 2019-12-22 05:08 GMT
ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ

హైదరాబాద్‌లోని దారుస్సలాంలోని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ భారీ బహిరంగ సభను శనివారం నిర్వహించారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఈ సభలో ఆయన మాట్లాడారు. దేశంలోని ప్రతి ఒక్క ముస్లిం తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని తెలిపారు. సీఏఏ, ఎన్‌ఆర్సీలను వ్యతిరేకించే దేశంలో ఉన్న ముస్లిం సోదరులు తప్పక ఈ పని చేయాలని పిలుపునిచ్చారు. మనమంతా భారత పౌరులమని, భారతావని మనదని నినాదాలను చాటాలన్నారు. ఈ సందేశం మోదీ సర్కారుకు చేరాలని తెలిపారు.

ఎన్ఆర్సీ స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత భారతీయులమని నిరూపించుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తోందన్నారు. ఎన్‌ఆర్సీ వల్ల నష్టమే కానీ ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. దీని వలన రాష్ట్రాలకు రాష్ట్రాలే ఖాళీ అయ్యే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. ఈ దుస్థితి 70 ఏళ్ల తర్వాత ఇప్పుడెందుకొచ్చిందని, ముస్లిం పేరు ఎన్‌ఆర్సీలో లేకపోతే.. అతడి కుటుంబం ఎక్కడికి వెళ్లాలి? అని ప్రశ్నించారు. ఇది చాలా బాధాకరమైన విషయమని ఆ‍యన అన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న గొడవలు హిందూ-ముస్లిం, బీజేపీ-మజ్లిస్‌ మధ్య కాదని, దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత పౌరులందరిపైనా ఉందని ఆయన సందేశం ఇచ్చారు. అనంతరం రాజ్యాంగాన్ని అవమానపరిచేలా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు అన్నివర్గాలు ఒక్క ముందుకు వచ్చి పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం సభలో చివరి ఘట్టంగా ఈ కార్యక్రమానికి హాజరైన అందరితో రాజ్యాంగ ప్రవేశిక చదివించిన అసద్‌.. జాతీయ గీతాలాపనతో సభ ముగించారు.

Tags:    

Similar News