ఆర్టికల్ 370 రద్దు: తెలంగాణలో హైఅలర్ట్

Update: 2019-08-05 08:41 GMT

పక్కా ప్లానింగ్‌.. ఊహకందని వ్యూహం.. ప్రతిపక్షాలకు ఏమాత్రం ఛాన్స్‌ ఇవ్వకుండా జమ్మూకాశ్మీర్‌పై కీలక ప్రకటన చేసింది కేంద్రం. జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఆర్టికల్‌ 370, 35ఏను రద్దు చేస్తూ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్రం నుంచి హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో ఉన్న పోలీసులకు, ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలని తెలంగాణలోని పోలీసు అధికారులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో డీజీపీ మహేందర్‌రెడ్డి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

అయితే ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉందని.. ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే అదనపు బలగాలను మోహరించేందుకు సైతం తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అటు సైబరాబాద్‌లోనూ హైఅలర్ట్ ప్రకటించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఈ సందర్భంగా ర్యాలీలు, ఊరేగింపులను పూర్తిగా నిషేధించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News