సహకార సంఘాల ఎన్నికలకు సర్వం సిద్దం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) ఎన్నికలను సహకారశాఖ ఎన్నికల అథారిటీ రేపు నిర్వహించనుంది.

Update: 2020-02-14 08:41 GMT

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) ఎన్నికలను సహకారశాఖ ఎన్నికల అథారిటీ రేపు నిర్వహించనుంది. ఇందుకు గాను అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేసారు. ఈ ఎన్నికలను నిర్వహించడానికి 747 మంది గెజిటెడ్‌ అధికారులను ఎన్నికల అధికారులుగా, మరో 20 వేల మంది ఉద్యోగులను సిబ్బందిగా నియమించారు. ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్‌ పత్రాలను ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాలకు అందుబాటులో ఉండేలా సరఫరాచేశామని తెలిపారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనున్న ఈ పోలింగ్‌లో దాదాపుగా 12 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారని అదికారులు తెలిపారు.

ఎన్నికలు ముగిసిన తరువాత మధ్యాహ్నం రెండు నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి సాయంత్రం వరకు ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని 747 పీఏసీఎస్‌ల పరిధిలోని 6,248 మంది డైరెక్టర్‌ పోస్టులకు నిర్వహిస్తున్నామని స్పష్టం చేసారు. ఎన్నికల ముగిసిన మూడురోజుల్లో పాలకవర్గాల నియామకాలను చేపట్టనున్నట్టు ఎన్నికల అథారిటీ అధికారులు చెప్పారు. పాలవర్గాల ఎన్నికల సందర్భంగా ఏదైనా సమస్యలు తలెత్తితే కో ఆపరేటివ్‌ చట్టాల ప్రకారం తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు స్పష్టంచేశారు. ఈ ఎన్నికలు ఎలాంటి గొడవలు, అల్లర్లు లేకుండా సజావుగా జరపాలని అదికారులు తెలిపారు. దీనిని సంబంధించి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసామని వారన్నారు.

Tags:    

Similar News