సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నుంచి కాశ్మీర్‌కు సైనిక బలగాలు!

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నుంచి మూడురోజులుగా సైనిక బలగాలను కాశ్మీర్‌కు పంపించడంపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Update: 2019-09-23 07:26 GMT

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతం నుంచి మూడురోజులుగా సైనిక బలగాలను కాశ్మీర్‌కు పంపించడంపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు యుద్ధం తప్పదని పాకిస్తాన్ హెచ్చరిస్తోంది, మరోవైపు పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకే కూడా స్వాధీనం చేసుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ లో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచీ భారీగా భద్రతా బలగాలను కశ్మీర్‎కు తరలించడంపై చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై యుద్ధమేఘాలు కమ్ముకుంటాయా అనే అనుమాలకు తావిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్ లో పలు రకాల అంక్షలు కూడా విధించారు. సైనిక బలగాల తరలింపుపై అధికారులు మాత్రం స్పందించడం లేదు. దేశభద్రతకు సంబంధించిన అంశం కాబట్టి వివరాలు అడగవద్దని చెబుతున్నారు. జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించే 370 ఆర్టికల్ రద్దు తర్వాత సరిహద్దు టెన్షన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News