రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

5 జనవరి, 2020 తేదీలోగా డిగ్రీ మహిళా కళాశాలల్లో ఆడ్మిషన్‌ పొందడానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది.

Update: 2019-12-24 03:16 GMT
ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో విద్యాప్రమాణాలు పెంచడానికి సోషల్‌ వెల్ఫేర్‌ విద్యాసంస్థలను ప్రభుత్వ ఏర్పాటు చేసింది. ప్రైమరీ తరగతుల నుంచి మొదలు పెడితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు నాణ్యమైన విద్యను అందించడానికి ఈ విద్యాసంస్థలను ఏర్పాటుచేసారు. ప్రతీ ఏడాది ఎంతో మంది విద్యార్థులు తమ విద్యను పూర్తి చేసుకుని విద్యాసంస్థల నుంచి బయటికి వెలతారు. ఇదిలా ఉంటే ఈ విద్యాసంస్థల్లో ప్రతీ ఏడాది ప్రవేశం కోసం నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది. ఇదే తరహాలో ఈ ఏడాది కూడా నోటిఫికేషన్ ను జారీ చేసింది.

తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ మహిళా కళాశాలల్లో డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 2020- 2021 విద్యా సంవత్సరానికి గాను ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నటు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కల్గిన విద్యార్థినుల నుంచి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

5 జనవరి, 2020 తేదీలోగా డిగ్రీ మహిళా కళాశాలల్లో ఆడ్మిషన్‌ పొందడానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రవేశ పరీక్ష జనవరి 19న జరుగుతుందన్నారు. వివరాలకు www.tswreis.in/. htpp// tgtwgurukulam& telangana.gov.in ను సంప్రదించాలని అధికారులు ప్రకటనలో తెలిపారు.



Tags:    

Similar News