సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ ప్రత్యేక ఏర్పాట్లు

Update: 2019-10-04 16:09 GMT

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రైవేట్ వాహనాలు, స్కూల్ బస్సులు తిప్పేలా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రైవేట్ వాహనాలకు రవాణా శాఖ రూట్‌ల వారీగా ధరలు నిర్ణయించింది. ధరలు పెంచి నడిపితే చర్యలు తప్పవని తెలిపింది. మరోవైపు సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉదయం 5 నుంచి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. రద్దీ సమయంలో ప్రతీ మూడు నిమిషాలకు, సాధారణ సమయాల్లో ప్రతి ఐదు నిమిషాలకు ఒక మెట్రో ట్రైన్ నడపనున్నారు. దీని కోసం ప్రత్యేక సిబ్బంది, అధికారులతో పర్యవేక్షించనున్నారు.

Tags:    

Similar News