Telangana: ఇవాళ మద్యం దుకాణాల కేటాయింపు.. లక్కీ డిప్ కార్యక్రమానికి భారీ బందోబస్తు

Telangana: అదృష్టాన్ని పరీక్షించుకోనున్న దరఖాస్తు దారులు

Update: 2023-08-21 02:14 GMT

Wine Shops: మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఆ జిల్లాల్లో 2 రోజులు వైన్ షాపులు బంద్

Telangana: తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన మద్యం దుకాణాల కేటాయింపు ఇవాళ జరగబోతోంది. అన్నిజిల్లాలల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు దుకాణాల కేటాయింపునకు లక్కీడ్రా తీసేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఎక్కడా గొడవలు, వివాదాలకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఒక లక్షా 31 వేల మంది మద్యం వ్యాపారులు లైసెన్స్ ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. 2021లో చివరి రౌండ్ లైసెన్స్ ల సమయంలో ప్రభుత్వానికి 69వేల దరఖాస్తులు వచ్చాయి. నాన్-రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు కింద 13వందలా 50 కోట్లు, షాప్ లైసెన్స్ ఫీజు ద్వారా 3వేల 500 కోట్లు ఆర్జించింది. మొత్తం షాపుల్లో హైదరాబాద్ లో 615 షాపులను కేటాయించనున్నారు.

కొత్త మద్యం పాలసీ ప్రకారం వ్యాపారులకు సాధారణ కేటగిరీకి 27 శాతం, ప్రీమియం కేటగిరీ, బీరుకు 20 శాతం మార్జిన్ గా నిర్ణయించారు. ప్రస్తుత లైసెన్సులు నవంబర్ 30 వరకు చెల్లుబాటులో ఉన్నప్పటికీ, నవంబర్-డిసెంబరులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం చాలా ముందుగానే టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది.

తెలంగాణలో మద్యం షాపుల కేటాయింపునకు దరఖాస్తు రుసుము రూపంలో తెలంగాణ ప్రభుత్వం 2వేల 639 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.

రాష్ట్రంలోని 2వేల 620 మద్యం దుకాణాలకు లక్షా 31వేల 954 దరఖాస్తులు వచ్చాయి. తిరిగి చెల్లించలేని దరఖాస్తు రుసుము రూపంలో రికార్డ్ ఆదాయాన్ని పొందింది. లక్కీడ్రా ద్వారా మద్యం దుకాణాలను కేటాయిస్తారు. ఎక్సైజ్ శాఖ డిసెంబర్ 1, 2023 నుంచి నవంబర్ 2025 వరకు దుకాణాల నిర్వహణకు లైసెన్స్ లను మంజూరు చేస్తుంది.

Tags:    

Similar News