ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ దగ్గర ఉద్రిక్తత

Update: 2019-07-25 08:18 GMT

తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేత, కొత్త అసెంబ్లీ నిర్మాణాల నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ధర్నా చౌక్ దగ్గర అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఛలో సెక్రెటేరియట్ పేరుతో ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న అఖిలపక్ష నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొత్త నిర్మాణాల పేరుతో ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు విపక్ష నేతలు. సంక్షేమ పథకాల కోసం డబ్బు లేక ఇబ్బందులుంటే ఇప్పుడు కొత్త నిర్మాణాల అవసరమా అని నేతలు ప్రశ్నించారు.

Full View  

Tags:    

Similar News