Soyam Bapu Rao: ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్ సంచలన వ్యాఖ్యలు

Soyam Bapu Rao: రమేష్ రాథోడ్, నేను ఇద్దరం టైగర్లమే: సోయం బాపూరావ్

Update: 2021-07-06 09:34 GMT

ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపు  (ఫైల్ ఇమేజ్)

Soyam Bapu Rao: రమేష్ రాథోడ్, నేను ఇద్దరం టైగర్లమే.. రాథోడ్ లంబాడీల టైగర్ అయితే, నేను ఆదివాసీల టైగర్‌ను.. మా ముందు జిల్లాలో ఏ పార్టీ నిలబడదు.. ఇవీ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్ సంచలన కామెంట్స్.! బీజేపీ కండువా కప్పుకున్న తర్వాత మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న బాపూరావ్ అధికార పార్టీపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఒకప్పుడు అడవులను దోచుకుని ఇప్పుడు మొక్కలు నాటుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఎంపీ సోయం బాపూరావ్ కామెంట్స్‌ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హాట్‌టాపిక్‌ అయ్యాయి.

Tags:    

Similar News