భక్తిశ్రద్ధలతో పరమశివునికి అభిషేక పూజలు

మండలంలోని మంగనుర్ గ్రామంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం శివాలయంలో పరమ శివునికి భక్తిశ్రద్ధలతో అభిషేక అర్చనలు, పూజలు, భజనలు నిర్వహించినట్లు నిర్వాహకులు వెల్దండ రామకృష్ణ ప్రసాదరావు తెలిపారు.

Update: 2020-02-21 14:40 GMT

బిజినెపల్లి: మండలంలోని మంగనుర్ గ్రామంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం శివాలయంలో పరమ శివునికి భక్తిశ్రద్ధలతో అభిషేక అర్చనలు, పూజలు, భజనలు నిర్వహించినట్లు నిర్వాహకులు వెల్దండ రామకృష్ణ ప్రసాదరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శివాల ఆవరణలో ప్రత్యేకంగా అఘోర పాశుపత హోమం శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. వేదపండితులు, రుత్వికులు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హోమ గుండాలలో, పలు ప్రాంతాల నుండి వచ్చిన దంపతులచే శాస్త్రోక్తంగా వైభవోపేతంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

హోమ విశిష్టతను తెలుపుతూ పరమశివుడు మానవునిలో పశు ప్రవృత్తి ని తొలగించి, సద్గుణాలతో వివేకవంతులుగా చేసి, సత్ ప్రవర్తనతో సమాజం దిశగా ఆలోచనలు కార్యాచరణతో, మానవునికి ఎంతో తోడ్పడుతుందని ఆయన అన్నారు. ఈ హోమం నిర్వహణతో పూజించినవారికి భక్తులకు ఇంట అష్ట ఐశ్వర్యాలు, సిరి సంపదలతో పాటు ఈ ప్రాంతమంతా నిత్య వర్షాలు అభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, మానసిక ,శారీరక అభివృద్ధి ఉంటుందని అన్నారు.

ప్రతి ఒక్కరికి ఎంతో పుణ్య ఫలితం ఉంటుందని తెలిపారు. అనంతరం స్వామివారికి నివేదించిన ప్రత్యేక తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో పూజారులు ఇరివెంటి సాయి రాఘవేంద్ర శర్మ, సురేష్ శర్మ, సంతోష్ శర్మ, రాజగోపాల శర్మ, భక్తులు, మహిళలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Tags:    

Similar News