Karimnagar: కరీంనగర్ జిల్లాలో మూడేళ్ల చిన్నారి మిస్సింగ్ కలకలం..
Karimnagar: పాప భారీ వర్షాలకు నాలాలో పడి కొట్టుకుపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.
Karimnagar: కరీంనగర్ జిల్లాలో మూడేళ్ల చిన్నారి మిస్సింగ్ కలకలం..
Karimnagar: కరీంనగర్ జిల్లాలో చిన్నారి కనిపించకుండా పోయిన ఘటన మిస్టరీగా మారింది. నాలుగు రోజుల కిందట రెండున్నరేళ్ల చిన్నారి కృతిక అదృశ్యమైంది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కూలిపనుల కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన కృతిక కుటుంబం కరీంనగర్ జిల్లాలో నివాసం ఉంటున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యశ్వంత్ సవిత కుటుంబం కరీంనగర్ రాంనగర్ లో ఉండి మేస్త్రీ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో పాప ఇంటిలో నుండి బయటకు వచ్చి ఆడుకుంటూ రోడ్డు క్రాస్ చేసి వెళ్లిపోయింది.
పాప ఇంటిలో లేదన్న విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పాప కోసం అన్నిచోట్ల వెతికి చివరికి రెండవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాలుగు రోజులుగా పోలీసులు గాలింపు చేపట్టిన ఆచూకీ లభ్యం కాలేదు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు .. పాప భారీ వర్షాలకు నాలాలో పడి కొట్టుకుపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. పాప తల్లిదండ్రులు నగరంలోని పలు నాళాలలలో వెతికి పోలీస్ స్టేషన్ ముందు పాప ఆచూకీ లభ్యమవుతుందని ఆశతో ఎదురుచూస్తున్నారు.