Mancherial: ఇంత దారుణమా.. ఎడ్లు పెరట్లో మేశాయని వ్యక్తి పై దాడి
Mancherial: ఘటనపై మండిపడుతున్న దళిత సంఘాల నేతలు
Mancherial: ఇంత దారుణమా.. ఎడ్లు పెరట్లో మేశాయని వ్యక్తి పై దాడి
Mancherial: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం శెట్టిపల్లిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని కర్రకు కట్టేసి కొట్టిన వైనం వెలుగుచూసింది. తమ పెరట్లో పశువులను మేపాడని దుర్గంబాపు అనే వ్యక్తిపై దౌర్జన్యం చేశాడు అదే గ్రామానికి చెందిన సూరరాంరెడ్డి. అతన్ని ఇంటినుంచి లాక్కెళ్లి.. కర్రకు కట్టేసి కొట్టాడు. అడ్డుకోవడానికి వెళ్ళిన గ్రామస్తులను కూడా దూషించాడని బాధితుడి కుమారుడు తెలిపాడు. ఈ ఘటనతో అవమానానికి గురైన బాపు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.