ఈజీఎస్‌ కింద కొత్తగా 95 పనులు

Update: 2020-01-14 03:30 GMT
ప్రతికాత్మక చిత్రం

గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఆర్థి్కంగా చేయూత నివ్వడం కోసం ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసింది. దీంతో రాష్ట్రంలోని ఎన్నో కుటుంబాల ఆర్థిక పరిస్థితి కొంత మేరకు మెరుగు పడింది. ఇప్పటివరకూ కేవలం మట్టి పనులను మాత్రమే ఈ పథకం ద్వారా అమలు చేయగా ఇప్పుడు ఈ పథకం కింద కొత్తగా 95 పనులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ పనులను ఈ ఏడాది నుంచే అమలు చేయనుంది. దీంతో ఇప్పటివరకూ ఉన్న వారికి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనివ్వబోతుంది. ఈ మేరకు కొత్తగా గుర్తించిన పనులు, అంచనా వ్యయం, వేతనం, సామగ్రి, పనిదినాలపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఎం.రఘునందన్‌రావు మార్గదర్శకాలు జారీ చేశారు. ఆయా పనుల్లో వినియోగించాల్సిన సామగ్రి, వేతనం, పనిదినాలపై స్పష్టతనిస్తూ ఉత్తర్వులిచ్చారు.

ఈజీఎస్‌ కింద చేపట్టనున్న ఈ పనులను అందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు గ్రామస్తులకు తెలుపుతున్నారు. గడిచిన ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరికీ పనిని కల్పించే అవకాశం ఉందని తెలిపారు. 


Tags:    

Similar News