శునకాలకు వింత రోగాలు : రెండు రోజుల్లో 12 కుక్కలు మృతి

ఒక పక్క రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం రేపుతుంటే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకున్నారు.

Update: 2020-04-08 05:13 GMT

ఒక పక్క రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం రేపుతుంటే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకున్నారు.మరో పక్క పక్షలకు, జంతువులకు ఏవో తెలియని వింత రోగాలు వచ్చి కుప్పలుగా చనిపోతున్నాయి. మొన్నటికి మొన్న వేలల్లో కోళ్లు చనిపోయి పౌల్ట్రీ యజమానులకు నష్టం కలిగించింది. ఆ తరువాత నిన్న కాకులను ఏదో తెలియని వింత రోగం వచ్చి అవి కూడా అకస్మాత్తుగా కుప్పకూలాయి. ఇప్పుడు ఇదే నేపథ్యంలో శునకాలకు వింత రోగం వచ్చి ఉన్న చోటే చనిపోతున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే దాదాపుగా 12 కుక్కలు రోడ్లపై కుప్పకూలి చనిపోయాయి. దీంతో ప్రజలు మరింత భయబ్రాంతులకు గురవుతున్నారు.

పూర్తివివరాల్లోకెళ్తే తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపెల్లి జిల్లా ఓడేడ్‌ గ్రామంలో వీధి కుక్కలు ఎక్కడిక్కడే కుప్పకూలుతున్నాయి. ఏదో తెలియని వింత జబ్బులతో రెండు రోజలు వ్యవధిలోనే దాదాపుగా 12 కుక్కలు ఉన్నట్టుండి చనిపోయాయి. దీంతో గ్రామస్తులంతా భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయం గ్రామంలోని పశువైద్యాధికారికి తెలియపరచడంతో ఆయన మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో గ్రామంలో కుక్కలు మృతిచెందాయని అది తమదృష్టికి వచ్చిందని తెలిపారు.

గ్రామంలో మూడు రోజుల క్రితం సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణంను పిచికారి చేశారని, బహుశా ఆ గడ్డి తిని శునకాలు చనిపోయి ఉంటాయని తెలిపారు. అయినా గ్రామస్తులు ఆందోళనగానే ఉండడంతో మల్లీ కుక్కలు చనిపోతే పోస్ట్ మార్టం నిర్వహించి కారణం ఏంటో చెపుతామని ఆయన అన్నారు. అంతే కాక గ్రామంలో కుక్కలను సరైన ఆహారం దొరకడం లేదని బహుశా అందుకే చనిపోయి ఉంటాయని ఆయన తెలిపారు.

గ్రామస్తులు భయ బ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఇక ఈ మధ్య కాలంలో అమెరికాలోని బ్లాంక్‌జూలో పులికి కరోనా వ్యాధి వచ్చిందని వార్తలు రావడంతో అదే విధంగా కుక్కలకు కూడా ఏదైనా వింత రోగం వచ్చిందేమో అని ఆందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News