మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ పోలీస్

వర్షపు నీటిలో నడవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్న ఓ రోగిని రోడ్డు దాటించడానికి ట్రాఫిక్ పోలీస్ తీసుకున్న చొరవను నెటిజన్లు కొనియాడుతున్నారు. ఎల్‌బీ నగర్ కూడలి వద్ద ఈ ఘటన జరిగింది.

Update: 2019-08-31 01:43 GMT

వర్షపు నీటిలో నడవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్న ఓ రోగిని రోడ్డు దాటించడానికి ట్రాఫిక్ పోలీస్ తీసుకున్న చొరవను నెటిజన్లు కొనియాడుతున్నారు. ఎల్‌బీ నగర్ కూడలి వద్ద ఈ ఘటన జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే.. వర్షపు నీటిలో రోడ్డును దాటడానికి ఇబ్బంది పడుతున్న ఓ రోగి పట్ల ట్రాఫిక్ పోలీస్ చూపిన ఔదార్యంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో ఎల్‌బీ నగర్ కూడలి జలమయమైంది.

అక్కడ ఉన్న నాగమల్లు అనే ట్రాఫిక్ పోలీసు నిలిచిపోయిన వర్షం నీరు దిగువకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో అదే మార్గంలో అదే సమయంలో ఓ వ్యక్తి కాలుకి దెబ్బతగిలిన తన తండ్రిని హాస్పటల్ నుంచి ఇంటికి తీసుకెళ్తున్నాడు.. అయితే రోడ్డుపై నీరు ఎక్కువగా ప్రవహిస్తుండటంతో.. సైలెన్సర్ లోకి నీళ్లు వెళ్లి బండి ఆగిపోయింది... అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సీఐ నాగమల్లు ఈ విషయాన్ని గమనించారు. వెంటనే పేషెంట్ కాలు నీటిలో తడవకుండా అతని కాలుకు ఓ కవర్ కట్టి.. తన బుజాలమీద ఆ వ్యక్తిని మొసుకెళ్లి ఒడ్డుకు చేర్చాడు. అయితే ఆ దృశ్యాలను అక్కడే ఉన్న కొంత మంది తమ సెల్‌ఫోన్లను చిత్రీకరించారు. సదరు వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో తెగ వైరల్ అవుతోంది. ట్రాఫిక్ పోలీస్ చూపిన చొరవకు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Tags:    

Similar News