హైదరాబాద్ పావురాలు శ్రీశైలం అడవులకు

హైదరాబాద్ చారిత్రిక కట్టడాలను అందవిహీనంగా చేస్తున్న బ్లాక్‌రాక్ పావురాలను అధికారులు అటవీ ప్రాంతానికి తరలించారు.

Update: 2019-10-26 04:51 GMT

హైదరాబాద్ చారిత్రిక కట్టడాలను అందవిహీనంగా చేస్తున్న బ్లాక్‌రాక్ పావురాలను అధికారులు అటవీ ప్రాంతానికి తరలించారు. మొజాంజాహి మార్కెట్ మున్సిపల్ కాంప్లెక్స్ గుమ్మటాలపై ఉండే 500 పావురాలని జీహెచ్‌ఎంసీ వెటర్నరీ విభాగం అధికారులు శుక్రవారం ఉదయం వలల ద్వారా పట్టుకుని అటవీశాఖకు అప్పగించారు. దీంతో వాటిని శ్రీశైలం అడవుల్లో వదిలేసారు. నగరంలో ఉన్న హెరిటేజ్ కట్టడాల పునరుద్ధరణలో భాగంగా జీహెచ్‌ఎంసీ 10 కోట్ల రూపాయల వ్యయంతో పనులను చేపట్టింది. ఈ పనులు దాదాపు 70 శాతానికి పైగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పునరుద్ధరణ చేసిన గుమ్మటంపై మార్కెట్‌లో ఉన్న వేలాది పావురాలు వాటిని అంద విహీనంగా మార్చడంతో వాటిని పట్టుకుని అడవులకు తరలించారు.

శుక్రవారం ఉదయం నుంచి మోజాంజాహి మార్కెట్‌లో పావురాల ఫీడింగ్‌కు అమ్ముతున్న జొన్నలను వెటర్నరీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో వున్న పావురాలు మాత్రమే కాకుండా నగరంలో అన్ని ప్రాంతాల్లో వున్న పావురాలను అటవీ ప్రాంతంలో వదిలేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారి విల్సన్ తెలిపారు. ఈ పావురాల వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ప్రబలుతాయన్నారు. ఈ వ్యాధి చిన్నపిల్లలు, వృద్ధులకు వెంటనే సోకే అవకాశం ఉందన్నారు.


Tags:    

Similar News