నిండు కుండలా హుస్సేన్ సాగర్ : ఏ క్షణమైనా గేట్లు ఎత్తివేత

హైదరాబాద్‌ హుస్సేన్‌ సాగర్‌ నిండుకుండను తలపిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి నగర పరిసరాల్లో కురుస్తున్న వర్షాలతో హుస్సెన్ సాగర్ లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. నిన్న హుస్సేన్‌ సాగర్‌లో నీటి మట్టం గరిష్ట స్థాయికి దగ్గర కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.

Update: 2019-09-03 04:46 GMT

హైదరాబాద్‌ హుస్సేన్‌ సాగర్‌ నిండుకుండను తలపిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి నగర పరిసరాల్లో కురుస్తున్న వర్షాలతో హుస్సెన్ సాగర్ లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. నిన్న హుస్సేన్‌ సాగర్‌లో నీటి మట్టం గరిష్ట స్థాయికి దగ్గర కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అయితే సాగర్ లోని నీటిని తరలించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా గేట్లు ఎత్తి వేసేందుకు అధికారులు రేడీగా ఉన్నారు. కాగా ముందస్తుగానే చుట్టప్రక్కల ప్రజలకు ఈ విషయం తెలియజేసి అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో కురిస్తున్న వర్షంతో సాగర్‌కు వరద పోటెత్తుతుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు నీటి పరిమాణాన్ని గమనిస్తున్నారు.

ఇక వినాయకచవితి పండుగ మొదలైంది. ఈ సందర్భంగా 11 రోజులకు వినాయక నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఏటా పెద్ద ఎత్తున వినయకుడి విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేస్తారు. అయితే ఈసారి హుస్సేన్ సాగర్‌లో వాటర్ ఫ్లో ఎక్కువ కావడంతో.. నిమజ్జనానికి అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందని గ్రహించిన అధికారులు ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక గణేష్‌ విగ్రహాల నిమజ్జనం సోమవారం నుంచి ప్రారంభం కానుండటంతో హుస్సేన్‌సాగర్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 11 వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి వరకు ఇవి అమల్లో ఉంటాయి. 

Tags:    

Similar News