Youtube: కంటెంట్ క్రియేటర్లకు గుడ్‌ న్యూస్‌... యూట్యూబ్‌లో అదిరిపోయే ఫీచర్‌

Update: 2024-12-13 13:42 GMT

Youtube introduced AI Based Dub feature for creators: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీరోజూ కోట్లాది వీడియోలు అప్‌లోడ్‌ అవుతుంటాయి. ఇటు కేవలం యూజర్లకు ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించడంతో పాటు క్రియేటర్లకు ఆదాయం అదిస్తోంది యూట్యూబ్‌. లక్షలాది మంది కంటెంట్‌ క్రియేటర్స్‌ యూట్యూబ్‌ ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. కాగా కంటెంటర్‌ క్రియేటర్ల అవసరాలకు అనుగుణంగా యూట్యూబ్‌ ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను అందిస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా యూట్యూబ్‌ మరో ఆసక్తికరమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసేలా ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఆటో డబ్‌ పేరుతో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. ఇంతకీ ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుంది? దీనివల్ల కంటెంట్ క్రియేటర్లకు ఎలాంటి ఉపయోగం ఉంటుందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆటో డబ్‌ ఫీచర్‌ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు ఇతర భాషల్లో కూడా యూజర్లు తమ కంటెంట్‌ను వినిపించవచ్చు.

అంటే భాషతో సంబంధం లేకుండా క్రియేటర్ల వీడియోల రీచ్‌ పెరుగుతుందన్నమాట. దీంతో ఎక్కువ వ్యూస్‌ పొందే అవకాశం ఉంటుంది. ఈ ఏఐ ఫీచర్ వీడియోల్లోని వాయిస్‌ను ఆటోమేటిక్‌గా డబ్ చేసి వివిధ భాషల్లోకి మార్చి వినిపిస్తుంది. భాషా పరంగా అడ్డంకులు లేకుండా వీడియోలను ఇతర భాషల్లో పోస్ట్ చేసేందుకు ఇది సహాయపడుతుంది.

ఉదాహరణకు మీరు ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ.. వీడియో క్రియేట్ చేశారనుకుందాం. ఈ ఫీచర్‌ సహాయంతో అందులోని ఆడియోను ఫ్రెంచ్, జర్మన్, హిందీ, ఇండోనేషియన్, ఇటాలియన్, జపనీస్, పోర్చుగీస్, స్పానిష్ వంటి తదితర భాషల్లోకి ఆటోమేటిక్‌గా డబ్ చేయగలదు. అయితే ఒకవేళ ఈ ఫీచర్‌ మీ వాయిస్‌ను గుర్తించలేకోతే డబ్బింగ్‌ ఆప్షన్‌ పనిచేయదు. కంటెంట్‌ క్రియేటర్ల అవసరాలకు అనుగుణంగా ఈ ఫీచర్‌లో మార్పులు చేస్తామని యూట్యూబ్ తెలిపింది. 

Tags:    

Similar News