WhatsApp Safety Feature: గ్రూపులో చేరితే పాత చాట్స్‌ కూడా కనిపిస్తాయి!

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వాడబడుతున్న మెసేజింగ్‌ యాప్ వాట్సప్‌ మరో కీలక సేఫ్టీ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫిషింగ్‌, స్కామ్‌లను అరికట్టే లక్ష్యంతో "సేఫ్టీ ఓవర్‌వ్యూ" అనే పేరుతో ఈ ఫీచర్‌ను ప్రారంభించింది.

Update: 2025-08-06 13:19 GMT

WhatsApp Safety Feature: గ్రూపులో చేరితే పాత చాట్స్‌ కూడా కనిపిస్తాయి!

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వాడబడుతున్న మెసేజింగ్‌ యాప్ వాట్సప్‌ మరో కీలక సేఫ్టీ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫిషింగ్‌, స్కామ్‌లను అరికట్టే లక్ష్యంతో "సేఫ్టీ ఓవర్‌వ్యూ" అనే పేరుతో ఈ ఫీచర్‌ను ప్రారంభించింది. తెలియని వ్యక్తులు మిమ్మల్ని గ్రూపుల్లో యాడ్‌ చేసినప్పుడు — మీరు చేర్చబడ్డ గ్రూపు విశ్వసనీయమా లేదా అనే విషయాన్ని ఈ ఫీచర్ ఆధారంగా తెలుసుకునే వీలుంటుంది.

ఫీచర్ ఎలా పని చేస్తుంది?

మీ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని వ్యక్తి ఏదైనా గ్రూపులోకి యాడ్‌ చేస్తే, ఆ గ్రూప్‌కు సంబంధించి పూర్తి వివరాలు కనిపిస్తాయి.

గ్రూప్‌ను ఎవరు సృష్టించారు? ఎప్పటి నుండి ఉంది? మొత్తం సభ్యుల వివరాలు కూడా చూపిస్తుంది.

గ్రూప్ చాట్‌లో చేరేముందే పూర్వ చాట్స్‌ను చూడొచ్చు — ఇది ఇప్పటివరకు అందని ఫీచర్.

గ్రూపులో ఉండాలా? వద్దా?

ఈ డిటైల్స్ చూసి మీరు గ్రూపులో ఉండాలా లేదా అనేది నిర్ణయించుకోవచ్చు. ఎగ్జిట్ అవ్వాలంటే — గ్రూప్ మెసేజ్‌లను ఓపెన్ చేయకుండానే బయటకు వచ్చేయొచ్చు. అయితే, ఆ గ్రూపులో మెసేజ్‌లు నోటిఫికేషన్‌గా రావాలంటే, మీరు చెక్‌మార్క్‌ పెట్టాల్సి ఉంటుంది. అంతవరకు అవి మ్యూట్‌ నుంచే ఉంటాయి.

ఇది ముఖ్యంగా స్టాక్ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీల పేరుతో వచ్చే మోసపూరిత గ్రూపులకు చుక్కలు చూపించడంలో ఉపయోగపడనుంది.

రాబోయే మరో ఫీచర్…

వాట్సప్‌ త్వరలో మరో ప్రయోజనకరమైన ఫీచర్‌ తీసుకురానుంది. మీ కాంటాక్ట్‌లో లేని వ్యక్తి మెసేజ్‌ చేస్తే, చాట్ స్టార్ట్‌ చేయకముందే అతని వివరాలతో హెచ్చరిక వచ్చేలా ఫీచర్‌ పని చేస్తుంది. ఫేక్ అకౌంట్స్, మోసాలను ముందే గుర్తించేందుకు ఇది ఎంతగానో దోహదపడనుంది.

భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు

ఇటీవల వాట్సప్‌ సంస్థ 6.8 మిలియన్‌ ఫేక్ ఖాతాలను బ్యాన్‌ చేసినట్లు ప్రకటించింది. ఇప్పుడు తీసుకొస్తున్న ఈ సేఫ్టీ ఓవర్‌వ్యూ ఫీచర్‌ కూడా ఆ మోసాల నిరోధానికి మరో అడుగు.

Tags:    

Similar News