Vivo Y500i: మిడ్‌రేంజ్‌లో వివో కొత్త ఫోన్ లాంచ్.. 7200mAh బ్యాటరీ, 50MP కెమెరా..!
Vivo Y500i: వివో కంపెనీ చైనా మార్కెట్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ వివో Y500iని అధికారికంగా లాంచ్ చేసింది.
Vivo Y500i: మిడ్‌రేంజ్‌లో వివో కొత్త ఫోన్ లాంచ్.. 7200mAh బ్యాటరీ, 50MP కెమెరా..!
Vivo Y500i: వివో కంపెనీ చైనా మార్కెట్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ వివో Y500iని అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఎక్కువ బ్యాటరీ లైఫ్, స్థిరమైన పనితీరు, మంచి డ్యూరబిలిటీపై దృష్టి పెట్టింది. రోజువారీ వియోగానికి నమ్మదగిన ఫోన్ కావాలనుకునే వారికి ఇది సరైన ఆప్షన్. వివో Y500iలో 7,200mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది ఎక్కువ సమయం స్క్రీన్ టైమ్ ఇస్తుంది. 44W ఫ్లాష్ చార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల త్వరగా ఛార్జ్ అవుతుంది. గేమింగ్, స్ట్రీమింగ్, హెవీ మల్టీటాస్కింగ్ చేసినా బ్యాటరీ త్వరగా అయిపోదు.
వివో Y500i ధర వివరాలు
8GB ర్యామ్ + 128GB స్టోరేజ్: 1,499 యువాన్ (భారత కరెన్సీలో దాదాపు రూ. 19,384)
8GB ర్యామ్ + 256GB స్టోరేజ్: 1,799 యువాన్ (సుమారు రూ. 23,264)
8GB ర్యామ్ + 512GB స్టోరేజ్ / 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్: 1,999 యువాన్
టాప్ మోడల్ 12GB ర్యామ్+ 512GB స్టోరేజ్: 2,199 యువాన్ (సుమారు రూ. 28,423)
గెలాక్సీ సిల్వర్, ఆబ్సిడియన్ బ్లాక్, ఫీనిక్స్ గోల్డ్ అనే మూడు రంగుల్లో లభిస్తుంది. వివో చైనా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 1570 x 720 పిక్సెల్స్. 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్ స్మూత్‌గా ఉంటుంది. 19.6:9 ఆస్పెక్ట్ రేషియోతో వీడియోలు, బ్రౌజింగ్, క్యాజువల్ గేమింగ్‌కు బాగా సరిపోతుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6తో వస్తుంది. స్మూత్ నావిగేషన్, మంచి కస్టమైజేషన్ ఫీచర్లు ఉన్నాయి.
స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రోజువారీ పనులు సులభంగా హ్యాండిల్ చేస్తుంది. 8GB LPDDR5X, 12GB LPDDR4X RAM ఆప్షన్లు ఉన్నాయి. 128GB, 256GB, 512GB UFS 3.1 స్టోరేజ్ ఉంది. మెమరీ ఫ్యూజన్ టెక్నాలజీతో 12GB వరకు వర్చువల్ ర్యామ్ జోడించవచ్చు. మల్టీటాస్కింగ్, బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లు స్మూత్‌గా రన్ అవుతాయి. రియర్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. f/1.8 అపర్చర్, ఆటోఫోకస్ సపోర్ట్ ఉన్నాయి. డేలైట్‌లో షార్ప్ ఫోటోలు తీస్తుంది. లో-లైట్‌లో కూడా సాధారణ ఉపయోగానికి సరిపడా క్వాలిటీ ఇస్తుంది. ఫ్రంట్‌లో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ సాధారణంగా క్లియర్‌గా వస్తాయి.
ఎత్తు 166.64mm, వెడల్పు 78.43mm, మందం 8.49mm. బరువు 219 గ్రాములు. చేతిలో మంచి ఫీల్ ఇస్తుంది. IP68 మరియు IP69 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్స్ ఉన్నాయి. SGS గోల్డ్ లేబుల్ 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ కూడా ఉంది. 5G సపోర్ట్ ఉంది, ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్స్ దొరుకుతాయి. డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంది. వై-ఫై, బ్లూటూత్ 4.2, GPS, సాటిలైట్ సిస్టమ్స్ ఉన్నాయి. USB టైప్-C పోర్ట్ మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ భారీ బ్యాటరీ, మంచి పర్‌ఫామెన్స్, డ్యూరబిలిటీతో బడ్జెట్ రేంజ్‌లో చాలా మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది.