Vivo Y19 5G Launched: వివో నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్.. చౌకగా కొనేయండి.. ఫీచర్లు మాత్రం కేక..!
వివో భారతదేశంలో మరో చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.
Vivo Y19 5G Launched: వివో నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్.. చౌకగా కొనేయండి.. ఫీచర్లు మాత్రం కేక..!
Vivo Y19 5G Launched: వివో భారతదేశంలో మరో చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ వివో ఫోన్ 5,500ఎమ్ఏహెచ్ బ్యాటరీతో సహా అనేక శక్తివంతమైన ఫీచర్స్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ.10,999కి లాంచ్ అయింది. ఈ వివో ఫోన్ 'వై' సిరీస్‌లో విడుదలైంది. ఈ వివో వై సిరీస్ ముఖ్యంగా బడ్జెట్ వినియోగదారుల కోసం. ఈ ఫోన్‌ను IP64 రేటింగ్‌తో మార్కెట్లోకి తీసుకొచ్చారు.
Vivo Y19 5G Price
ఈ వివో ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ అయింది. 4జీబీ ర్యామ్ + 64జీబీ, 4జీబీ ర్యామ్ + 128జీబీ, 6జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో విడుదవలైంది. దీని ప్రారంభ ధర రూ.10,999. దీని ఇతర రెండు వేరియంట్ల ధరలు వరుసగా రూ. 11,499, రూ. 12,999 కు లభిస్తాయి. ఈ వివో స్మార్ట్‌ఫోన్‌ను ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు. కంపెనీ టాప్ వేరియంట్ పై నో-కాస్ట్ ఈఎమ్ఐని కూడా అందిస్తోంది.
Vivo Y19 5G Features
ఈ వివో ఫోన్ 6.74-అంగుళాల హెచ్‌డిప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే 90Hz హై రిఫ్రెష్ రేట్, 700 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే టీయూవీ రీన్‌ల్యాండ్ సర్టిఫైడ్ పొందింది. అలానే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. దీనితో 6జీబీ వరకు ర్యామ్,128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 2టీవీ వరకు పెంచుకోవచ్చు.
వివో ఈ ఫోన్‌లో ఏఐ ఎరేజర్, ఏఐ ఫోటో ఎన్‌హాన్స్, ఏఐ డాక్యుమెంట్స్ వంటి ఏఐ ఫీచర్లను అందించింది. ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 13మెగాపిక్సెల్ ప్రైమరీ, 0.08మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 5మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో బ్లూటూత్ 5.4, యూఎస్‌బి 2.0, ఎన్ఎఫ్‌సి వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా, ఫోన్‌లో 5,500ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది, దీనితో 15W యూఎస్‌బి టైప్ C ఛార్జింగ్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.