Vivo V50e 5G Pre Booking Price and Offers: వావ్.. వండర్‌ఫుల్.. వివో V50e 5G ఫోన్ బుకింగ్స్ షురూ.. ఆఫర్లు చూస్తే షాక్ అవుతారు..!

Vivo V50e 5G Pre Booking Price and Offers: వివో భారతదేశంలో V50e 5G ఫోన్‌ను విడుదల చేసింది, ఇది రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది.

Update: 2025-04-11 05:27 GMT

Vivo V50e 5G Pre Booking Price and Offers: వావ్.. వండర్‌ఫుల్.. వివో V50e 5G ఫోన్ బుకింగ్స్ షురూ.. ఆఫర్లు చూస్తే షాక్ అవుతారు..!

Vivo V50e 5G Pre Booking Price and Offers: వివో భారతదేశంలో V50e 5G ఫోన్‌ను విడుదల చేసింది, ఇది రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.30 వేల బడ్జెట్‌లో కొనుగోలు చేయచ్చు. అయితే మొదటి సేల్‌కి ముందు ఫోన్ ప్రీ-బుకింగ్ కోసం ప్రారంభమైంది. మీరు వివో V50e 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రీ ఆర్డర్ చేయచ్చు. దీని ధరపై డిస్కౌంట్లు కూడా అందిస్తుంది. దీని వలన దాని ధర మరింత తగ్గచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్లు, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

Vivo V50e 5G First Sale

వివో V50e స్మార్ట్‌ఫోన్ ప్రీ-బుకింగ్ ప్రారంభమైంది. దీని మొదటి సేల్ ఏప్రిల్ 17న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. వివో V50e ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా, మీరు వివో అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా ఫోన్‌ను కొనుగోలు చేయచ్చు.

Vivo V50e 5G Price And Offers

మొదటి సేల్ సమయంలో Vivo V50e స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్ ద్వారా డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐ బ్యాంక్ కార్డులపై 10 శాతం తగ్గింపు లభిస్తుంది. అయితే, మీరు 10 శాతం ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా పొందచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో Vivo V50e ఫోన్ 8GB + 128GB వేరియంట్ ధర రూ.33,999. అయితే కంపెనీ దీనిపై రూ.5000 డిస్కౌంట్ అందిస్తుంది. ఇప్పుడు రూ.28,999కి కొనుగోలు చేయచ్చు. కాగా, V50e 8GB + 256GB వేరియంట్ ధరపై కూడా రూ. 5,000 తగ్గింపు లభిస్తోంది. ఈ ఫోన్ రూ.35,999కి బదులుగా రూ.30,999కి అందుబాటులో ఉంది. రెండు స్మార్ట్‌ఫోన్‌లు రెండు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉన్నాయి. సఫైర్ బ్లూ, పెర్ల్ వైట్.

Vivo V50e 5G Features And Specifications

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.77-అంగుళాల అమోలెడ్ క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ స్క్రీన్‌‌కి సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ ర్యామ్ 8జీబీకి పెంచే అవకాశం కూడా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoC ప్రాసెసర్‌తో కూడిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ ఓస్ 15 స్కిన్‌పై రన్ అవుతుంది. HDR 10+ సపోర్ట్‌తో వచ్చే ఈ ఫోన్ IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉంది.

బ్యాటరీ, కెమెరా గురించి మాట్లాడుకుంటే.. ఫోన్‌లో OIS సపోర్ట్‌లో 50MP సోనీ IMX882 మెయిన్ కెమెరా ఉంది. ఇది కాకుండా, వెనుక కెమెరాలో 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా ఉంది. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 5600mAh బ్యాటరీతో 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 9 గంటలు పనిచేస్తుందని పేర్కొన్నారు.

Tags:    

Similar News